ప్రకాశం జిల్లా దొనకొండ పరిధిలో ఉన్న ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి సూచించారు. వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వెయ్యకుండా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. జ్వరాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వెంటనే మాకు సమాచారం అందించాలన్నారు. సంబంధిత వైద్య బృందం పరీక్షించి మందులను ఇవ్వడం జరుగుతుందన్నారు.