రామాయంపేట, నిజాంపేట్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రాహుల్ రామాయంపేట నుండి సిద్దిపేట్ వెళ్లి జాతీయ రహదారి నిజాంపేట్ మండలం బ్రిడ్జ్ డామేజ్ ను పరిశీలించారు. అనంతరం నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలోని ప్రవాహానికి కొట్టుకపోయిన రెండు బ్రిడ్జిలను, నిజాంపేట్ నుండి నస్కల్ వెళ్లి దారిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పురాతన బ్రిడ్జ్ లను రెవిన్యూ ఆర్ అండ్ బి అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలోని చెరువును మరియు పర్వతాపూర్ వెళ్లే దారిలో వరద ప్రభావానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు.