ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న తీరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ మీద తయారుచేయాలని నిర్వాహకులకు సూచించారు. డ్రైనేజీ, నీటి సమస్యలకు పరిష్కారం చూపాలని గ్రామ పంచాయతీ కా