కుప్పంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జల హారతి ఇచ్చి హంద్రీనీవా జలాలను కుప్పంకు విడుదల చేశారు. కుప్పం మండలం పరమసముద్రం సమీపంలో హంద్రీనీవా కాలువ వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా హారతి ఇచ్చారు. అనంతరం హంద్రీనీవా స్తూపంతో పాటు మహిళా ఇండస్ట్రియల్ పార్క్, మహిళా శక్తి భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.