Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: పనితీరు మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవు పట్టణ ప్రణాళిక సిబ్బందితో కమిషనర్ పి.విశ్వనాథ్

India | Aug 20, 2025
పదేపదే చెప్పించుకోవద్దు, పనితీరు మెరుగుపడకపోతే ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పట్టణ ప్రణాళిక సిబ్బంది, ప్లానింగ్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఎంతో ఉందని, వాటిని సక్రమంగా అమలుపరచకపోతే కఠిన తీసుకోక తప్పదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us