ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదేనని,ఉపాధ్యాయులే మార్గదర్శకులని MLC పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు.బుధవారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమాన్నిMLC పింగిలి శ్రీపాల్ రెడ్డి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్, DEO పింకేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా MLC పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందన్నారు.విద్య ప్రమాణలను పెంచడం లో ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.