కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో బుధవారం ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి / ఎయిడ్స్ నిర్మూలన మరియు నియంత్రణ మండలి మరియు కడప జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ మండలి ఆదేశాల మేరకు చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో IEC హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ సిబ్బంది శోభ మాట్లాడుతూ హెచ్ఐవి మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల గురించిన సమాచారాన్ని వివరించారు.