మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు పోటూరి శ్రీను,అశ్విని వీరిద్దరూ గురువారం రాత్రి జగ్గంపేట నుంచి వారి స్వగహానికి వెళ్తూ ఉండగా గోకవరం వైపు నుంచి జగ్గంపేట వస్తున్న కారు అతి వేగంగా నిర్లక్ష్యంగా నడుపుకుంటూ ఎదురుగుండా వస్తున్న బైకును ఢీ కొట్టి అక్కడితో ఆగకుండా రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు రోడ్డు మీద పడడంతో తీవ్ర గాయాలు కాగా కారు యొక్క ముందు భాగం కొంతమేర ధ్వంసం అయింది, అంతేకాకుండా కార్ల ప్రయాణిస్తున్న వారు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.