వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటివద్దకే చేరేవని ఇప్పుడు సక్రమంగా అందడం లేదని రాయదుర్గం పట్టణానికి చెందిన పలువురు కూటమి ప్రభుత్వంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, పలువురు కౌన్సిలర్లు పట్టణంలోని 21,24 వార్డులలో బుధవారం సాయంత్రం పర్యటించారు. వారితో పలువురు మహిళలు, వృద్ధులు తమకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని తెలిపారు. అప్పటి వాలంటీర్ల సేవలే బేషుగ్గా ఉండేవని చెప్పారు.