Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది ఉంటుందని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని తన క్యాంపు కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైన వారికి చెక్కులను పంపిణీ చేశారు. సాలూరు పట్టణంలోని 27వ వార్డుకు చెందిన గౌడు రమేష్ కు 1లక్షా,62వేల రూపాయల చెక్కును, 21వ వార్డుకు చెందిన లావుడి శివాజీపట్నాయక్ కు 63వేల 462 రూపాయల చెక్ ను అందజేశారు.