రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తే అర్హత కూడా షర్మిలకు లేదని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి పేరు చార్జిషీట్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో ఆమె అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పుడే వైస్సార్ ని వందసార్లు చంపేశారని.. ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు చంద్రబాబు చేసింది శూన్యమని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆయన పక్కదారి పట్టించారని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆగ్రహం వ్యక్తం చేశారు