మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా అనంతపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి. అనంతరం అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించిన అనంత, వైసీపీ శ్రేణులు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి వద్ద అన్నదానం చేసారు.