ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక పంచాయతీ రెండో వార్డు సభ్యుడు కముజు వీర వెంకట సత్యనారాయణ (48) మృతి చెందారు. కొబ్బరి బొండం తీసేందుకు చెట్టు ఎక్కి కాలుజారి పడిపోవడంతో అక్కకి అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు. మృతుని భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం ఎస్సై జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.