జిల్లాలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని,ఇంకా యూరియా జిల్లాకు సరఫరా అవుతుందని, జిల్లా వ్యాప్తంగా మెగా అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టి విస్తృతంగా ఇంటింటికి తిరిగి రైతులకు ధైర్యం చెప్పాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరెట్ లొని కలెక్టర్ ఛాంబరు నందు జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వ్యవసాయ అధికారులు, క్షేత్రాధికారులతో యూరియా సరఫరా, స్థితిగతులపై పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.