భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పర్యటించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. రంగాపూర్ గ్రామంలో 30 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.