శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వేరే వేరే కేసుల్లో గంజాయి ముఠా ను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ముఠాతో పాటు గంజాయి మరియు 2050 రూపాయలు మరియు ఒక సెల్ ఫోను స్వాధీనం పరుచుకున్నారు.ఈ గంజాయి సుమారు గా 6.115 కేజీలు ఉంటుందని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేసారు.