తెలంగాణ భాషా దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాకవి కాలోజీ నారాయణరావుకు కలెక్టర్ మన చౌదరి నివాళులర్పించారు. మంగళవారం అంతయపల్లిలోని కలెక్టరేట్ కార్యాలయంలో కాలోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.