మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ లోని శివాలయాలు కిక్కిరిసిపోతున్నాయి.ఇందులో భాగంగా పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వెలసిన స్వామికి స్టేషన్ సిబ్బంది పూజలు చేశారు. స్టేషన్ నిర్మించేటప్పుడు శివుడి విగ్రహం ప్రత్యక్షమైందని పోలీసులు తెలిపారు. ఆ విగ్రహాలకు చిన్నగా గుడి కట్టి నిత్యం పూజలు చేస్తామని, బుధవారం మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశామన్నారు.