ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పరిధిలో దుర్గ నగర్ కాలనీ నందు పోచమ్మ దేవి ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వంగా మధుసూదన్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు చీర గణేష్, చీర సురేష్, చీర శివ, ఇమిడి బీరప్ప, తదితరులు పాల్గొన్నారు.