పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.