ప్రకాశం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ సమీపంలో రోడ్డుపై మురుగునీరుతో అవస్థలు పడుతున్నామని రైతు సంఘం నాయకులు పాపిరెడ్డి తెలిపారు. ఎన్నో నెలల నుండి నీరు నిలబడిపోవడంతో డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని అన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని రైతు సంఘం నాయకులు పాపిరెడ్డి అన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.