ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు బుధవారం వాడవాడలా ఘనంగా జరిగాయి. భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు మండల గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భీమడోలులోని గణపతి సెంటర్ ప్రసిద్ధ శ్రీమన్మహా గణపతి ఆలయంలో వినాయకచవితి పురస్కరించుకుని శ్రీమన్మహాగణపతి ఆలయంలో 61వ నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు తెలిపారు.