సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన వాటర్ ఫిల్టర్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామెత కలిసి మంగళవారం ప్రారంభించారు. చికిత్స కోసం వచ్చే రోగుల దాహార్తిని తీర్చేందుకు ఈ వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవరావు, యోగానంద చార్యులు డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.