బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయ పురం గ్రామంలో ఈనెల 5వ తేదీన దొంగతనం జరిగిన నేపథ్యంలో శుక్రవారం పోలీసులు దొంగలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ వెంకట్రావు మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు చెందిన రవికుమార్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ సుమారు 7 లక్షల ఉంటుందని సీఐ వెంకట్రావు పేర్కొన్నారు.