అనంతపురం నగరంలోని ఉమా గోడౌన్ సమీపాన ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కుక్క అడ్డు రావడంతో డివైడర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న లక్నోకు చెందిన రాహుల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కోటంక నుండి అనంతపురం కు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఉమా గోడౌన్ సమీపాన ప్రమాదం జరిగినది. రాహుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.ఈ సంఘటనకు సంబంధించి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.