Parvathipuram, Parvathipuram Manyam | Dec 31, 2024
పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురంలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనంత నాయుడు మంగళవారం సాయంత్రం రైలు పట్టాలపై మృతి చెంది కనపడ్డాడు. అక్కడి పోలీసులు అనంత నాయుడు మృతి పై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.