ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూర్ ఎస్బీఐ బ్యాంకు ముందు మధ్యాహ్నం రెండు గంటలకు నిరసన చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జీఎస్ గోపి, జిల్లా నాయకులు వెంకటేష్, అజయ్‌లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై ఎన్నికల బాండ్లను అడ్డగోలుగా తీసుకుందని దీని ద్వారా వేల కోట్ల రూపాయలు బీజేపీ ఖాతాలో జమ చేసుకొని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. వీటిని వెంటనే ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.