జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రోజున యముడి జన్మనక్షత్రమైన భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజు ఆలయంలోని మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, ధూపదీప, కర్పూర హారతులను స్వామి వారికీ సమర్పించారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం ఎదుట ఉన్న గండదీపంలో నూనె పోసి స్వామివారిని దర్శించుకున్నారు...