దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. దేవనకొండ పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. కరివేముల గ్రామానికి చెందిన వ్యక్తి తలారి పశువుల రాగన్న కోడుమూరు కు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడికి శుక్రవారం కర్నూల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారన్నారు.