కళ్యాణదుర్గం లోని దొడగడ్డ రోడ్డులో మంగళవారం ఓ కొట్టంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. మంటలను గమనించిన హోంగార్డు లక్ష్మన్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. దీంతో తృటి లో పెను ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.