డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డీఎస్సీ 2003 టీచర్స్ ఫారం రాష్ట్ర కన్వీనర్ నాగరాజు అన్నారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు రోడ్డుపైకి వచ్చారన్నారు ప్రభుత్వం తప్పిదానికి 2003లో డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందామన్నారు. కానీ తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. తక్షణమే అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.