దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని మంగళవారం మధ్యాహ్నం గజపతినగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లోనూ వైసిపి నాయకులు నిర్వహించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ హోదాలో ఉన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు, పార్టీ మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైయస్సార్ అమరహే అంటూ నినాదాలు చేశారు.