పెద్ద కడబూరు:హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడమే లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ పెద్ద కడబూరు మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్ద కడబూరులోని శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయంనందు విజయదశమి ఉత్సవాలను నిర్వహణపైఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.విజయదశమి ఉత్సవాలను విజయవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరవ రమాకాంత రెడ్డి, సురేశ్ రెడ్డి, వినోద్ రెడ్డి పాల్గొన్నారు.