పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ ఎడ్లపాడు మండల పరిధిలోని ఉన్నవా మరియు గొట్టిపాడు గ్రామం వద్ద బైకు అదుపుతప్పి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వినాయక చవితి నిమజ్జనం కోసం బోయపాలెం నుంచి సూర్యలంక వెళ్తూ ఉండగా ఆదివారం మధ్యాహ్నం 3:00 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 కి సమాచారం అందించగా క్షతగాత్రులకి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.