శివకోటి జడ్పీహెచ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే పాఠశాల అభివృద్ధికి స్థానికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు