రాయదుర్గం పట్టణంలోని హోటళ్లు డాబాలలో రుచి, సుచి, శుభ్రత లేని ఆహార పదార్థాలు కనిపిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం మద్యాహ్నం పట్టణంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న తృప్తి గ్రాండ్, లక్ష్మీ హోటల్ లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుబ్రత, నాన్యత లేని, సుమారు 10 రోజులుగా ప్రిజ్ లలో నిల్వ ఉంచిన మాంసం, ఇతర ఆహార పదార్థాలు గుర్తించారు. ఆ హోటళ్ళ నిర్వాహకులకు జరిమానాలు విధించి మరోసారి పునరావృత్తం అయితే లైసన్సులు రద్దు చేయడంతో పాటు, సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.