ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అని తిరుపతి జిల్లా గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ అన్నారు. జనసేనపార్టీ నాయకులు తీగల చంద్రశేఖర్ రావ్ ఆధ్వర్యంలో మంగళవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు