వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు...ఊరూరా వాడవాడ వినాయకుడి మండపాలు వెలుస్తాయి..నవరాత్రులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక సందడిగా ఉంటుంది..ఐతే మండపాల్లో కొలువుదీరే విగ్రహాలు విషయానికి వస్తే అవన్నీ కూడా పాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలే మనకు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఖమ్మంలోని వెంకటేశ్వర గోశాల వారు ఈసారి వినాయకచవితికి ప్రత్యేకమైన వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ పర్యావరణానికి మేలు చేకూరే విధంగా దోహదపడుతున్నారు.