రైతులు న్యాయమైన సమస్యల కోసం, బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కోసం అండగా నిలబడిన సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ పై తప్పుడు బైండోవర్ కేసు తక్షణమే ఉపసంహరించుకోవాలని, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, చిట్వేల్ రవికుమార్, పందికాళ్ల మణి, ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాజంపేట బొప్పాయి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ నిర్ణయించిన, తొమ్మిది రూపాయల ధరను అమలు చేయని, రైతులను మోసం చేసే దళారుల పైన , ఢిల్లీ వ్యాపారస్తులపైన,420 కేసు నమోదు చేయాలన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం లోని కోడూరు, చిట్వేలు, పెన