విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, విద్యుత్ చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని **‘ప్రతిజ్ఞ దినం’**గా ప్రకటించారు.గత 2000లో హైదరాబాద్ బషీర్బాగ్ ఘటనలో విద్యుత్ సంస్కరణల వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు అర్పించిన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలకు నేతలు నివాళులర్పించారు.నాయకులు మాట్లాడుతూ –“స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేసి, విద్యుత్ బిల్లులను తగ్గించాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం” అని హెచ్చరించారు. “ప్రజల ఆగ్రహాన