ప్రకాశం జిల్లా ఒంగోలులోని సర్వజన మెడికల్ కాలేజీ కాన్ఫరెన్సు హాల్ నందు మంగళవారం జరిగిన శిక్షణ కార్యక్రములో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ ఆర్.సి.హెచ్ 2.0 పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య పోర్టల్ - వెర్షన్ 2.0 అనేది ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ అప్‌గ్రేడ్ చేయబడిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అని అన్నారు.ఇది దేశవ్యాప్తంగా ప్రసూతి, శిశు మరియు పునరుత్పత్తి ఆరోగ్య సేవల పంపిణీ, పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్‌ను క్రమబద్ధీకరించడానికి మరియు బలోపేతం చేయడానికి రూపొందించబడింది. దీనిలో భాగంగా జిల్లాలో గ్రామీణ మరియు పట్టాన ఆరోగ్యకేంద్రాలలో పనిచేయు వారికీ శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు