మెదక్ జిల్లా నర్సాపూర్ లోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపానికి రక్షణగా డీసీఎం వ్యాన్ ను మండపం గా ఏర్పాటు చేసుకొని ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండపానికి వినాయకునికి ఇలాంటి ఇబ్బందులు కలవకూడదు అన్న ఉద్దేశంతో డీసీఎం వ్యాన్ ను వినాయక మండపంగా ఏర్పాటు చేసి పూజలు అందించి పలువురు మన్ననలు పొందుతున్నారు.