కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు బుధవారం విద్య పే అండ్ అకౌంట్స్ స్టేట్ ఎడిట్ ఫర్ యు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పువ్వులతో ముస్తాబు చేసిన బతుకమ్మలతో సాంప్రదాయ దుస్తులతో హాజరై బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు... తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయంలో బతుకమ్మ పండుగకు విశిష్ట స్థానం ఉందన్నారు.