బేతంచెర్లలో కరోనా సమయంలో, తరవాత నుంచి ట్రైన్లను ఆపడం లేదని సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ట్రైన్లు ఆపాలని కోరుతూ గతంలో MP బైరెడ్డి శబరికి ప్రజల నుంచి సంతకాల సేకరణ చేసిన వినతిపత్రాన్ని అందించారు. ఆమె చొరవతో రేపటి నుంచి కొండవీడు ఎక్స్ప్రెస్ ఆగుతుండటంతో వారు శబరికి ధన్యవాదాలు తెలిపారు.