మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉన్న నేటి రోజుల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిస కాకూడదని పెనగలూరు ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం చక్రంపేట ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ లేబాకు గోపాలకృష్ణ అధ్యక్షతన విద్యార్థులకు మొబైల్ ఫోన్ల వినియోగం, డ్రగ్స్, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అత్యవసర సమాచారం అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాత్రమే ఒకటి లేదా రెండు నిమిషాలు మాట్లాడి ఫోను పక్కన పెట్టాలన్నారు. ఫోన్లో వచ్చే అశ్లీల చిత్రాలు చూడకూడదు అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్సై నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.