సురేక తల్లి పిల్లల ఆసుపత్రి వద్ద పద్మావతి క్లాత్ స్టోర్స్ లో చోరికి ఒక వ్యక్తి ప్రయత్నించ్చాడు. దుకాణం వెనుక నుండి బిల్డింగ్ పైకి వెళ్లి చోరికి యత్నించగా ఎటువంటి అవకాశం లేక తప్పించుకునే ప్రయత్నం చేసాడు. తప్పించుకునే ప్రయత్నంలో దుకాణం ముందు ఉన్న అద్దం గమనించక అద్దం పగిలి రోడ్డుపై పడటంతో స్థానికులు ఆ వ్యక్తిని గుర్తించారు. స్థానికులు చూడటంతో దూకి చచ్చిపోతా అని హల్చల్ చేయటంతో దుకాణ యజమాని స్థానికులు ఎటువంటి పిర్యాదు చేయము జాగ్రత్తగా దిగాలని సూచించి అతడిని కిందకు దింపటంతో ప్రమాదం తప్పింది.