క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ (హాకీ లెజెండ్) జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే వారోత్సవాలు ఈనెల 23 నుండి 31 వరకు దేశమంతటా క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం సిరిసిల్ల మినీ స్టేడియంలో సైకిల్ ర్యాలీని సిరిసిల్ల మినీ స్టేడియం నుండి రాజీవ్ నగర్ బైపాస్ రోడ్డు వరకు మరియు అక్కడి నుండి తిరిగి మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది. అలాగే నేషనల్ స్పోర్ట్స్ డే ప్రతిజ్ఞను నిర్వహించి, ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ రామదాసు మాట్లాడారు.