ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను పరువురు ఉపాధ్యాయులకు అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం పార్వతీపురంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లాలో సాలూరు మండలంతో పాటు సాలూరు మున్సిపాలిటీ కి చెందిన అత్యధిక మంది అవార్డులను దక్కించుకోవడం చర్చినీయవలసిందిగా మారింది. సాలూరు మండల పరిధిలో పద్మ, రవి, రమణమ్మ, అయ్యప్ప, గిరిబాబు అలాగే సాలూరు మున్సిపాలిటీ పరిధిలో శ్యామ్, వేణుగోపాల్, జానకిరామ రాజు, మురళి, ప్రదీప్ ఉన్నారు.