వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని దోమకొండ AO మణిదీపిక తెలిపారు. ఈ పథకం కింద చిన్న, సన్నకారు, మహిళ, ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు ప్రత్యేక రాయితీ ఇస్తామన్నారు. చేతిపంపులు, పవర్ స్ప్రేయర్లు, రోటివేటర్లు, బ్రష్ కట్టర్లు ట్రాక్టర్తో నడిచే కల్టివేటర్స్, ప్లవ్, కేజీవీల్స్ ఇస్తామని చెప్పారు. యాంత్రీకరణలో ఇప్పటి వరకు లబ్ధి పొందని రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.