శనివారం స్వచ్ఛంద స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాలతో జిల్లా పోలీస్ కార్యాలయం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో నేర్పించారు స్వచ్ఛత అనేది మన బాధ్యత మాత్రమే కాదు అది మన సమాజానికి ఇచ్చే బహుమతి అంటూ జిల్లా ఎస్పీ ప్రజలందరూ పరిశుభ్రతతో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయం నందు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి సిబ్బందిచే స్వచ్ఛ దివస్ పై ప్రతిజ్ఞ చేయించారు.